Saturday, January 9, 2010

ఇంటర్నేటా మజాకా!

Internet, వెబ్ సైట్ అంటే తెలియని వారికి సైతం వై ఎస్ ఆర్ మరణం వర్సెస్ రిలయన్స్ వ్యవహారం వాళ్ళ వెబ్ మీడియా పవర్ ఏంటో వెబ్ సైట్ లో ప్రచురించిన వార్తలకు ఎలాంటి విలువ ఉంటుందో తెలిసింది.

Monday, January 4, 2010

తమిళనాడు, కేరళ లో కనిపించే జనవరి 15 సూర్యగ్రహణం

జనవరి ౧౫ న సంభవించే సూర్యగ్రహణం కంకణ సూర్యగ్రహణం అని ఇది తమిళనాడు మరియు కేరళ లో స్పష్టంగా కనిపిస్తుందని శాస్తవేత్తలు, హిందూ జ్యోతిష్యులు పేర్కొంటున్నారు. మద్యాహ్నం ఒకటి నుండి రెండు గంటల మధ్యలో సరిగ్గా చెప్పాలంటే ఒంటి గంట ఇరవై నిమిషాలకు గోచరింస్తుందని చెప్పారు. కన్యాకుమారి, నాగర్ కొయిల్ వంటి తమిళ పట్టణాలు, కాలికట్, తిరువనంతపురం వంటి కేరళ నగరాల ప్రజలు యీ గ్రహణాన్ని వీక్షించవచ్చని పరిశోధకుల మాట.

జనవరి ౧౫ సూర్యగ్రహణం ఏయే రాశులకు శుభం, ఏయే రాశులకు మాధ్యమం, ఏయే రాశులకు చెడు అనేది ఇక్కడ చూడండి.
సూర్య గ్రహణ సమయంలో పాటించవలసిన సంస్కారాల గురించి ఇక్కడ చదవండి.

గ్రహణ సమయంలో గర్భిణి స్త్రీలు పాటించాల్సిన జాగ్రతలు

గ్రహణం - గర్భిణీలు : గ్రహణ సమయంలో పాటించే జాగ్రత్తల గురించిన విజ్ఞాన శాస్త్ర విషయాలు - గర్భిణీ స్త్రీలు గ్రహణసంస్కారాలు ఎందుకు పాటించాలి ?

హిందూప్యాడ్.కం - హిందూ అధ్యాత్మిక బ్లాగ్

హిందూప్యాడ్ అనేది ఒక హిందూ ఆధ్యాత్మిక భక్తి సమాచారం తెలిపే బ్లాగ్. ఉగాది, సంక్రాంతి, శివరాత్రి, శ్రీ రామనవమి, హనుమాన్ జయంతి, రాఖి పౌర్ణమి, వినాయక చవితి, దసరా, బతుకమ్మ పండుగ, దీపావళి, వంటి ప్రముఖమైన పండుగలు, పర్వదినాలే కాకుండా ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య, స్కంద షష్టి, సంకష్టి చవితి, ప్రదోషం, మాస శివరాత్రి వంటి నెలవారీ పర్వదినాల విషయాలు కూడా హిందూప్యాడ్ వెబ్ సైట్ లో పొందుపరచ బడతాయి.

ప్రతి సంవత్సరంలో వచ్చే నాలుగు నవరాత్రులు (వసంత నవరాత్రి, ఆషాడ నవరాత్రి, శరద్ నవరాత్రి, మాఘ నవరాత్రి), వాటి విశేషాలు అత్యంత విశ్లేషణాత్మకంగా యీ హిందూప్యాడ్ లో ఉంచబడతాయి.

సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం, గ్రహణ సమయంలో పాటించవలసిన జాగ్రతలు, గర్భిణి స్త్రీలు మరియు గ్రహణం, ఇండియా, అనేక దేశాలు నగరాల్లో గ్రహణం పట్టే సమయ సూచీ కూడా హిందూప్యాడ్ లో ఇవ్వబడినాయి.

ఇది నా మొదటి పోస్ట్

హలో! బాగున్నారా! ఇది తెలుగు బ్లాగింగు లో మొదటి బ్లాగ్ మరియు మొదటి పోస్ట్. బ్లాగర్ కి నా కృతజ్ఞతలు..... మంచి పోస్ట్ లతో మీ ముందుకు వస్తాను...